a378

378

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ||కఱుణా||

  1. హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదమున నొందిన ||కఱుణా||

  2. కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా నొందిన ||కఱుణా||

  3. శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన ||కఱుణా||

  4. కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు ప్యాయముగ నొందిన ||కఱుణా||

  5. దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన సథలము ||కఱుణా||

  6. ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు వర్షించెడి చోటు ||కఱుణా||

Post a Comment

Previous Post Next Post