ఎంతో దుఃఖము బొందితివా నాకొర కెంతో

182

రాగం - ముఖారి
తాళం - త్రిపుట
    ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా
    యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు
    ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ గా || నెంతో ||

  1. వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు
    నిన్ను మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా || యెంతో ||

  2. సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా
    నీవు పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను || ఎంతో ||

  3. కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును
    వారు పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము || నెంతో ||

  4. నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి నారా
    నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ జూపినావా || యెంతో ||

  5. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా
    ఆహా యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా || యెంతో ||

  6. అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన
    నన్ను ఎన్నఁ డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా || యెంతో ||

    Ento duḥkhamum bonditiva nakora kento duḥkhamu pondi tiva
    yento duḥkhamu niku ento cintayu niku ento digulayya naku
    a ponti pilatu yu dulu nikum bettina śramalanu dalapoyam ga || nento ||

  1. vacciri yudulu muccata laḍucu neccata vamḍanucu
    ninnu maccaramuto vari yicca vaccinatlu kotti duṣincinara || yento ||

  2. sundaramagu deha manduna debbalu grandhulu gattinava
    nivu pondina badha na ḍendamu talampana nandamule dayenu || ento ||

  3. kottukottumani tittikel dattini nnattittu nettucunu
    varu pettuśramalu tuda mattuna korciyum bettitiva praṇamu || nento ||

  4. nepamum bettucum ditti yapahasincucu yuda capalulu gotti nara
    na yaparadhamulaku na padalanu bondi ni kr̥pa nakum jupinava || yento ||

  5. chakkani na yesu mikkili badha ni kekkuva galige nayya
    aha yokka duṣtumḍite prakkanu grucci tana yakkasa dircukonena || yento ||

  6. annadam'mulaina akka sellem ḍrainam kanna pitradu laina
    nannu ennam ḍaina bremincale rairi na yanna premincinava || yento ||

Post a Comment

Previous Post Next Post