207
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడమును కట్టు నప్పుడు = పలుకుభాషయు - నొక్కటైనను - పలువిదములగు భాషలాయెను - నలుదెసలకును - జనులుపోయిరి కలువరిపై - కలుసుకొనిరి || ఎంత ||
- పావనుండగు ప్రభువు మన కొరకై - యా సిలువమీద చావునొందెడు సమయమందున - దేవుడా నా దేవుడా నన్నేల చెయివిడిచి తివియని యా - రావముగ మొర్రబెట్టెను యె - హోవయను దన తండ్రితోను || ఎంత ||
- అందు దిమిరము క్రమ్ముగడియయ్యె - నా నీతిసూర్యుని నంత చుట్టెను బంధకంబులు - నిందవాయువులెన్నో వీచెను కందు యేసు నియావరించెను - పందెముగ నొకకాటు వేసెను - పాతసర్పము ప్రభువు యేసును || ఎంత ||
- సాంతమాయె నటంచు బలుకుచు - ఆ రక్షకుడు తన స్వంత విలువగు
ప్రాణమును వీడెన్ - ఇంతలో నొక భటుడు తనదగు నీటెతో
ప్రభు ప్రక్కబొడువగ - చెంతచేరెడి పాపులను ర - క్షించు రక్తపు ధార గారెను || ఎంత ||
- galibili galige nokappuDu - Sinyaaru baabelu kaTTaDamunu kaTTu nappuDu = palukubhaashayu -
nokkaTainanu - paluvidamulagu bhaashalaayenu - naludesalakunu -
janulupOyiri kaluvaripai - kalusukoniri || eMta ||
- paavanuMDagu prabhuvu mana korakai - yaa siluvameeda chaavunoMdeDu
samayamaMduna - daevuDaa naa daevuDaa nannaela cheyiviDichi tiviyani yaa - raavamuga morrabeTTenu
ye - hOvayanu dana taMDritOnu || eMta ||
- aMdu dimiramu krammugaDiyayye - naa neetisooryuni naMta chuTTenu
baMdhakaMbulu - niMdavaayuvulennO veechenu kaMdu yaesu niyaavariMchenu -
paMdemuga nokakaaTu vaesenu - paatasarpamu prabhuvu yaesunu || eMta ||
- saaMtamaaye naTaMchu balukuchu - aa rakshakuDu tana svaMta viluvagu praaNamunu veeDen^ - iMtalO noka bhaTuDu tanadagu neeTetO prabhu prakkaboDuvaga - cheMtachaereDi paapulanu ra - kshiMchu raktapu dhaara gaarenu || eMta ||