191
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు ||ఎంతో||
- మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడ మూర్ఛబోయె నేసు తండ్రి ||యెంతో||
- కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలో జీలల్ కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ||యెంతో||
- దాహముగొన జేదు చిరక ద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా ||యెంతో||
- బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహా ఏరై పారె యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు ||నెంతో||