190
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||
- కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||
- కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా ||ఆహా||
- బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే ||ఆహా||