a189

189

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె ||వందనం||

  1. సుందరుడ నీ శిరసు హేళన బొందె ముండ్ల కిరీట ముంచగ నెందు జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్ను గొలిచెద నందముగ మహిమ ప్రభువా ||వందనం||

  2. భీకరుడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి నుమి వేయబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము ||వందనం||

  3. మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగు జూడగ గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచగా నాలో చించగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి పోయెను మరణ బలమున ||వందనం||

  4. సిలువ యెదుటను నిపుడు నేనిక నిలిచి నిను బ్రార్థింతు బ్రభువా ఖలుడ నని నను ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక పిలిచెద నిన్నే గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా యేసు నిను జేతులతో నాపెద ||వందనం||

  5. నిన్ను నే గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విక ని న్నెటుల నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నుని జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే ||వందనం||

  6. మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగ గృపతో వరబలుండా నా విరోధుని కరకు శరముల ద్రుంచ రావె శూరుడా దేవకు మారుడా అటు నీ మరణ రూపము సిలువపై నా తరుణమున జూపుము యెహోవా ||వందనం||

Post a Comment

Previous Post Next Post