లేచినాడురా సమాధి గెలిచినాడురా

687 288

"మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును." యెషయా Isaiah 25:8"
    లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు
    లేచినాడురా సమాధి గెలిచినాడురా

    లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు

  1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
    ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న || లేచినాడురా ||

  2. ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి
    భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు || లేచినాడురా ||

  3. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును
    శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ || లేచినాడురా ||

  4. చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
    లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని || లేచినాడురా ||

  5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
    చచ్చినను నను లేపుతాడు - చావు అంటె భయపడరాదు || లేచినాడురా ||

  6. నేను చేసే పనుల నెరుగు - నేను నడిచే మార్గ మెరుగు
    నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు || లేచినాడురా ||

  7. నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందు
    తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు || లేచినాడురా ||

  8. పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
    నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభున్ || లేచినాడురా ||

  9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం
    యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం || లేచినాడురా ||

  10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు
    పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు || లేచినాడురా ||


    Lechinaaduraa samaadhi gelichinaaduraa yesu lechinaaduraa samaadhi gelichi naaduraa

    Lethunani thaa jeppinatlu - lekhanamulo paliki natlu

  1. Bhadramugaa samaadhi paini - pedda raatini yunchiri bhatulu - mudravesi raatriyantha nidraleka kaavaliyunna || Lechinadura ||

  2. Prabhuvu doota paramunundi - thwaragaa digi raatini porlinchi bhalira daanipai koorchunde - bhayamu nonda kaavalivaaru || Lechinadura ||

  3. Proddu podavaka munde sreelu - siddaparachina sugandhamunu shradda thoda thechi yesuku - ruddudaamani vachchi chooda || Lechinadura ||

  4. Chooda vellina sreelanu doota - choochi yapude vaari thoda ledu galaliya munduga pothunnaadu - apude lechinaadani || Lechinadura ||

  5. Chachchi poyi lechinaadu - swamy bakhtula kagupadinaadu chachichinanu nanu leputhaadu - chaavu ante bhayapada raadu || Lechinadura ||

  6. Nenu chese panula nerugu - nenu nadiche maarga merugu - nenu cheppu maata lerugu - nenu brathike brathuku nerugu || Lechinadura ||

  7. Nenu lechina yesunandu maanaka madi nammu kondu thaanu naalo yundi nanduna - dayanu jerchunu mokshamandu || Lechinadura ||

  8. Paapa bhaaramu ledu manaku - marana bhayamu ledu manaku - naraka baadha ledu manaku - maruva kandi yesu prabhuni || Lechinadura ||

  9. Yesu nande rakshana bhaagyam - yesu nande nitya jeevam - yesu nande aatma shaanti - yesu nande moksha bhaagyam || Lechinadura ||

  10. Paapulakai vachinaadu - paapulanu karuninchinaadu - paapulanu preminchinaadu praana daanamu chesinaadu || Lechinadura ||

Post a Comment

Previous Post Next Post