1
రాగం - కాంభోజి తాళం - ఆట
- నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను - బన్నుగ జేసిన - బలుడ వీవె = ఉన్న లోకంబుల - నుడుగక కరుణా సం - పన్నతతో నేలు - ప్రభుడ వీవె = అన్ని జీవుల నెఱిగి - యాహార మిచ్చుచు - నున్న సర్వజ్ఞుం - డవు నీవే = ఎన్న శక్యముగాక - ఉన్న లక్షణముల - సన్నుతించుటకు నే - జాలుదునా ||యన్ని||
- పుట్టింప నీవంచు - బోషింప నీవంచు - గిట్టింప నీవంచు - గీర్తింతును = వట్టి పనికి మాలి నట్టి మానవుల చే - పట్టి రక్షింపం బా - ధ్యుండ వంచు = దట్టమైన కృపను - దరిజేర్చ నాకిచ్చి - పట్టయి నిలచియుండు - ప్రభుడ వంచు = గట్టడచే గడ - ముట్టుదనుక నా - పట్టుకొలది నిన్ను - బ్రస్తుతింతు ||నన్ని||
- కారుణ్యనిధి వీవు - కఠినాత్ముడను నేను - భూరి శుద్ధుడ వీవు - పాపి నేను = సార భాగ్యుడ వీవు - జగతిలో నాకన్న - దారిద్రుడే లేడు - తరచి చూడ = సార సద్గుణముల - సంపన్నుడవు నీవు - ఘోర దుర్గుణ సం - చారి నేను = ఏ రీతి స్తుతియింతు - నే రీతి సేవింతు - నేర మెన్నక ప్రోవ - నెర నమ్మితి ||నన్ని||
-
Ninnu prakatana seya- nikhila loakamulanu- bannuga chesina baluda viive = unna loakambula –nudugaka karunaa sampannatha thoa nelu-prabhuda viive- enna sakhyamu kaaka – unna lakshanamula sannuthinchutaku ne-chaaludunaa || yanni ||
-
Puttimpa niivanchu- poashimpa niivanchu-gittimpa niivanchu – kiirthinthunu = vatti paniki maali natti maanavulache – patti rakshimpa baa-dhyunda vanchu = dhattamaina krupanu dari jercha naakicchi –pattayi nilachiyundu –prabhuda vanchu = kattadache gada-muttudhanuka naa –pattukoladhi ninnu prasthu thinthu || yanni ||
-
Kaarunya nidhi viivu – katinaathmudanu nenu- bhuuri suddhudaviivu-paapi nenu = saara bhaagyuda viivu-jagathiloa naakanna daaridhrude ledu- tharachi chuuda = saara sadhgunamula – sampannudavu niivu – ghoara durguna sam-chaari nenu = e riithi sthuthi yinthu –ne riithi sevinthu - nera mennaka proava- neranammithi || yanni ||