a118

118

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబులలరగ ||మేము||

  1. బేదలేము పురములోన బీద కన్యమరియకు బేదగా సురూపు దాల్చి వెలసె బశులపాకలో ||మేము||

  2. జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతుము ||మేము||

  3. తద్దరిశనమందు మాకు బెద్ద మేలు గలిగెగా హద్దులేని పాపమంత రద్దుపరచబడెనుగా ||మేము||

  4. మరణమెపుడొ రేపొమాపో మరియెపుడో మన మెరుగము త్వరగా పోయి పరమగురుని దరిశనంబు జేతము ||మేము||

  5. హరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగా నొసంగెను పరమపురము మాకు హక్కు పంచెదాను నిరతము ||మేము||

  6. మాకు సర్వగర్వమణిగి మంచి మార్గమబ్బెను మాకు నీ సువార్త జెప్ప మక్కువెంతో గలిగెను ||మేము||

Post a Comment

Previous Post Next Post