135
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి||
- యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం ||రండి||
- యేసే సంఘములో మనకాంతి యేసే హృదయములో ఘనశాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి ||రండి||
- యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శంతికి సూత్రం వాసిగ నమ్మిన జనస్తోత్రం. ||రండి||