137
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగ ద్రుంచు ప్రభు ||యేసు||
- నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు ప్రభు ||యేసు||
- ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు ప్రభు ||యేసు||
- మోక్ష దశకు సాక్ష్య మొసగు నక్షయ సురక్షణకు దక్షత వహించ ప్రభు ||యేసు||
- శీల మతుల పాలి వెతల తూల జనదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||