139
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే మనశ్శాంతి భజింపను ||యేసే||
- యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ భజింపను ||యేసే||
- యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు భజింపను ||యేసే||
- యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ భజింపను ||యేసే||
- యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం భజింపను ||యేసే||