a160

160

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఇదిగో శుభద రక్షణము దేవుడు పంపె నిదిగో శుభద రక్షణము సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల చేత బలుకబడె ||ఇదిగో||

  1. అలపిశాచముతోడను దేవుడు తొల్లి బలుకు వాక్యము జాడను పొలతి సంతతి నిన్ను తలగొట్ట బుట్టునని తెలియజేసెను మోషె దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||

  2. ఘన దివ్య బలిచేయను పాపములెల్ల దునిమి పుణ్యము లియ్యను ఒనరగ నీ కాల మున గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో||

  3. యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూర గ్రీస్తుడు బుట్టుట ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమున దెల్పబడె ముందు వేదమునందు ||ఇదిగో||

  4. మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో||

Post a Comment

Previous Post Next Post