a172

172

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము దోసకారి జనుల కెంతో గ్రాసమవునా యేసు పేరు ||యేసు||

  1. తల్లిదండ్రులకన్న చాలా దన ప్రేమ మనమీద నెల్లకాలమందు నుంచు యేసుడే మా తండ్రియౌను ||యేసు||

  2. వల్లగాని వశములేని యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి దేవ కొమరుడే వేరెవరు లేరు ||యేసు||

  3. దండియైన గండములు మెండుగాను మముజుట్టిన తండ్రివలె మా దరికి వచ్చి గండములను గదిమి బ్రోచున్ ||యేసు||

  4. సత్యము మార్గముతానె నిత్యజీవమింకా తానే భ్రుత్యుల మనకీయ మోక్షము భువిని రక్తమంత గార్చె ||యేసు||

  5. ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము భువిని బలిపెట్టినాడు ||యేసు||

  6. ఒడలు నిండా గాయములతో నడరు చుండమరల లేచి వెడలి పరమందునుండి వేడుకలు మాకంపినాడు ||యేసు||

  7. ఆశతోడ తన్ను నమ్ము యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు సాటి లేశమైనా లేరుసుండీ ||యేసు||

Post a Comment

Previous Post Next Post