175
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దార పుత్రాది బంధు శ్రేణిపై మమ కార భావము జెందుచు దద్విషయమై కోరి దుఃఖము లొందుచు భ్రమ గుందుచు భూరి మాయా జాల బంధా కర మిది యని తెలియ కీ సం సార మంతయు నాది నాదని యూరకే చెడిపోవ నేటికి ||నేమి||
- ఈ దేహమునకు బ్రాణమునకు సంబంధ మించు కైన గలదా దేహాత్మలకు భేదము గన వలదా బుద్ధి గొన వలదా యాది నే దేహము నాత్మ స మాదరంబున నుండు నా తను వీ ధరిత్రిని విడచి చను నపుడే దయామృతవార్ధి దిక్కగు ||నేమి||
- జాయా పుత్రోద్యాన గృహ విత్తా ట్టాలక సకల వస్తు జాలము ప్రతిష్ఠాను భూతి విధేయులు నఖిల సంపదలు నీ యవని లోపల సమర్పణ జేయగా బడు గాని యించుక తోయమును గొని పోవశక్యము లేద హా భ్రమ నొంద నేటికి ||నేమి||