a187

187

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై నాపదలను దన కీగతి బెట్టెడు కాపురుషుల దెస గనుగొను కృపతో ||బాపుల||

  1. యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుగ బలికి వా రల నోదార్చెను ||బాపుల||

  2. శత్రువు లటు తను జంపుచు నుండగ మైత్రి జూపె సమ్మతి తోడన్ స్తోత్రము జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||

  3. తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరు డించుక వేడు కొనన్ కనికరము మన మున బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||

  4. మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగ ||బాపుల||

Post a Comment

Previous Post Next Post