193
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||
- దురితంపు దలపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో ముండ్ల కిరీటమై ||చూడరే||
- పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో మేకులు ||చూడరే||
- పాపేచ్ఛ తోడ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని బెల్లంపు పోటులు ||చూడరే||