211
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నిన్ నేజేర గోరగా నన్ను బాయు పాపము శుద్ధిజేతునంచును యేసు మాటనిచ్చెను.
నన్ను ను నా మిత్రులన్ లోక యాస్తి గాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు. యేసుమాట నమ్మెదన్ క్రీస్తు రక్త పుణ్యము జూచి మ్రొక్కి యేసుతో నేను మృతినొందితిన్. యేసు తాను వచ్చును నాకు నిచ్చు పూర్ణతన్ శుద్ధ సౌఖ్య మొందుదున్ జయస్తోత్ర మేసుకు.