24
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యెహోవ సంద్రము మీద భుమి పునాది వేసె మహాజలమూల మీద మనదేవుడది స్థిరపర్చె ||భూ||
- యెహోవ పర్వతమునకు నెక్కంగ బాత్రుడెవడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవడు ||భూ||
- అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాడే ||భూ||
- ఆలాటి వాడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ||
- ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే ||భూ||
- ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ రారాజు కొరకుతలుపులాలా మిమ్మెత్తుకొనుడి ||భూ||
- ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవడు బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ ||భూ||