a244

244

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరిశుద్ధాత్ముడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య వరుడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు మయ్య ||పరి||

  1. బలమౌ నీ వెలుగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యము గలిగించి విశ్వాస మున వారి నొనగూర్చి వెలయుచుండెడు నీకే విన తుల్ సల్పుదు మయ్య ||పరి||

  2. బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుగా! ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మదితోడ బిలువ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ బల వాక్య మిడు మాకు ||పరి||

  3. విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని యవనిం బ్రతుక నిమ్ము ||పరి||

  4. పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్తా జరిగింప నీ యాజ్ఞలన్ త్వర నొందు చరణములు స్థిర డెందమును నిమ్ము పరిశోధనలు గలుగ భయమొంద నీయకుము ||పరి||

  5. మరణ జీవంబు ల స్థిర యోధులను బోలి పరుగెత్త నీ దారినే తిరత దప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమతో నిడి సిద్ధ పరచుము మము ప్రభువా ||పరి||

Post a Comment

Previous Post Next Post