259
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- స్థాపకుడు యెహోవా దేవుడు పాపులను గావ నోపి సుతుని బంపె కరుణుడు ఈ పవిత్ర సంఘమునకు దీపము పరిశుద్ధ వేద మేపుమీఱు శిరసు క్రీస్తు కాపుకర్త పావనాత్మ ||యేసు||
- వరుడు క్రీస్తు యేసునాధుని మురువంపు వధువై పరగు నహ విశేషఖ్యాతిని సరిగెపట్టు నారచీర లరయ నీతి న్యాయము లవి యురుతరా భరణముల సుం దరము భక్తి వర్తనంబు ||యేసు||
- తన యమూల్య రక్తము దెచ్చి యనురక్తు డీమె కనిశ శుల్క దా నమునిచ్చి ఘను డగు నా పావనాత్మ తనకు దోడుజేసి మంచి పని తనమున నీమె కొక్క భవనము గట్టంగ బోయె ||యేసు||
- మరణ విజయు డైన వీరుడు మహాబ్రములపై నరుగుదెంచు మహిమ శూరుడు నిరతప్రేమ కాము డీమె కరముబట్టి పెండ్లి యాడ ద్వరగ వచ్చు గాన భక్తి పెరుగు బ్రతుకు టుత్తమంబు ||యేసు||