264
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఒక్కడే దేవుడిందు ఒక్క విశ్వాసము ఒక్కటే జన్మ మిందు ఒక్క కుటుంబము ఒక్క ప్రసాద విందు ఒకే సునామము నిరీక్షణొక్క టిందు నిరంత ప్రాప్తికే
అసత్య మార్గమంచు అనేకుల్ నవ్వినన్ విభాగ మై శ్రమంబుల్ విశేష మొందినన్ సుభక్తుల్ వేడుచుంద్రు అభయ కాంతికై యీ నింద లెల్ల బోయె ఆనంద నాటికై
కఠిన దుఃఖ బాధల్ కల్గిన నోర్చుచు విభ వానంద ప్రాప్తి లభింప గోరుచు ఆ స్వర్గ పంక్తిజేరి యానంద మొందుచున్ యీ సంఘ మేసు గూడి విశ్రాంతి బొందును