a266

266

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాడెవండు ||ఘన||

  1. వెలయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో మనసార నిజము పలుకు చుండువాడై సుమ్మ ||ఘన||

  2. తనదు నాల్కతోగొండె మాడడు తన సఖునకును గీడు చేయడు తనదు పొరుగు వానిపై నిం దలను మోపడించు కేనియు ||ఘన||

  3. వానికిని నీచుం డసహ్యుడు వాడు భక్తుల గౌరవించును హాని కలిగిన నాతడును బ్ర మాణ మాడియు మాట తప్పడు ||ఘన||

  4. మరియు ద్రవ్యము వడ్డి కీయడు నిరపరాధిని జెఱప లంచము అరయ డిట్టుల జేయువాడే ధర నెపుడు గదల్పబడడు ||ఘన||

  5. జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుగాక మును పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకు గల్గునుగాక యామేన్ ||జనక||

Post a Comment

Previous Post Next Post