a267

267

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో యందమైనవి సంత తంబు బరమ ప్రేమను దెల్ప సంతస మందుచు సరిగ బ్రకటన జేయ అంతటను బని బూని ప్రభు న త్యంతముగ బ్రక టించి వసుధ న నంత మగు శుభవార్త జాటెడు వింత యగు బోధకుల పాదము ||లెంతో||

  1. మందమతులగు వారలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు వందుచు గుందుచు వన గిరి కందరము లందు నున్న సకల మౌ మోటుజన మెరుగ పొందుగా ప్రభు యే సొసంగెడు సుందరం బగు సత్య వాక్యం బందుకొని చాటించుచుండెడు అంద మగు బోధ కుల పాదము ||లెంతో||

  2. మదిలో ప్రభుని నమ్మిన పాపుల నెల్ల తుదిని మోక్ష పదమ్మున విదితమ్ముగా జేర్చి ప్రీతి జూపున టంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద సన్నిధిని జేర్ప సదయులై శుభవార్తమానము ముదమునను మదిలోన నిడి కొని పదిలముగ ప్రకటించుచుండెడి విదితు లగు బోధకుల పాదము ||లెంతో||

  3. యేసు క్రీస్తు రారాజై యున్నాడనుచు భాసురంబుగ దెల్పుచు వాసిగా ప్రభు యేసు వసుధ రక్షకుడనుచు యీ సువార్తను జాటి యిచట నెమ్మదినొంద దోసకారి జనంబు లందరి కీ సుమంగళ వార్త దెలుపుచు దోస మంతయు బాపు మన ప్రభు యేసు జూపెడు వారి పాదము ||లెంతో||



Post a Comment

Previous Post Next Post