268
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బలుడా యీ కాలంబునన్ దివారాత్ర ములు నీదు సేవకులున్ నలు దిక్కులను దిరిగి విలసిల్లు నీ వార్త పలు జనాంగములకు బ్రకటించు చుందురు ||పరి||
- ప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవము బడసిరి నీ బిడ్డలు అతులుండు నీ పుత్రు డాజ్ఞాపించిన యట్లే యతి తీవ్రతను వేడ అధిపా మాకొస గుము ||పరి||
- పరిశుద్ధాత్మ బలంబును వాక్యపు ధృతిని బడసిన బోధకులను ఇరుల శక్తిని ద్రోసి నరులను నీ తట్టు మరల జేసెడువారి ద్వరలో బంపుము దేవ ||పరి||
- నీ యాత్మ కాంతితోడ బూర్వము వలెనే డాయంగ మము జేయుమా యే యడ్డున్నను బాపి యెలమి నింగిని జీల్చి దాయుము మము స్వేచ్ఛ దయచేసి నీ యొద్ద ||పరి||
- జను లెల్ల నీ వాక్యపు శక్తి నెఱింగి ఘనపరప ద్వరచేయుము పెను సంఘములు లోక మున నాటి యిశ్రాయేల్ జనపు నిద్రను బాపు జయ మొందు నీ వాక్కు ||పరి||
- ఇల సంఘమున నెడారుల్ కప్పుము దేవ తొలగించు మాటంకము అల నీ వాక్యమునకు నడ్డంబు లేమియు గలుగకుండగ నిమ్ము ఘన సంఘాధ్యక్షుండ ||పరి||
- నీ సంఘమును నబద్ధ బోధలనుండి నిర్మలంబుగగావుమా గాసిజేసెడు జీత గాండ్లను బాపి నీ భాసిల్లు నుద్యాన వనముగ నుంచుమా ||పరి||