a282

282

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మన యేసు మరణస్మా రణవిందులోబాలు గొనరండు ప్రియులార వినయమానసులై మన దోష చయమెల్ల దనమేన ధరియించు కొనిమనల గావ నా యన పడిన శ్రమలెంచి ||మన యేసు||

  1. మరల మన మధ్యకా పరమాత్ముడరుదెంచ వఱకాయనను మనము మఱవకుండుటకై స్థిర భక్తి నద్దాని జరిగింపవలెనంచు గురుతరంబగు నాజ్ఞ నెఱపితా జనెగాన ||మన యేసు||

  2. తినుడిది యె నా దివ్య తనువంచు నొక రొట్టి యను వ్రచ్చి ప్రభు డిచ్చె ననుబంధుతతికి ఘన శ్రద్ధదానిగై కొని మనము భుజియింప నొన గూడు జిరజీవ మనుమాన మికనేల ||మన యేసు||

  3. ఆ రీతి నిజరక్త ధారయై వెలయు ద్రా క్షారసము నిచ్చె నిం పార గొను డనుచు గోరి యా మధుధార గ్రోలిన మనకుక్షి దోరమౌ జీవంపుధార లుద్భవ మొందు ||మన యేసు||

  4. ప్రభు భక్తి నెవడు దై వభయంబు లేక య నుభవించు వానిక శుభమౌ నా మీద విభవంబు దొలగురో గభయంబు చేకూరు శుభ మవ్వానికి నెపుడు లభియింపదని తెలిసి ||మన యేసు||

  5. మిము మీరె తగురీతి గమనించి పరిశోధ నము చేసికొని మీ పాపము లోప్పుకొనుచు నమితార్తిబశాత్తా పముబొంది యీ విందు క్రమము బాటింప క్షే మము మీకు సిద్ధించు ||మన యేసు||

  6. దురితాంధకార భా స్కరుడు సద్గురుడేసు పరమవిందున కిది యను ప్రాసంబని యెఱిగి ఉరణశాబకరక్త సరి దంతఃపరిపూతాం బరులైసత్కార్యత త్పరులై బంధురమతులై ||మన యేసు||

Post a Comment

Previous Post Next Post