a300

300

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నా డు ||రారె||

  1. సారహీన మగు సం సారాబ్ధిలో జిక్కి భారమనుచు నీత నేరని వారికి తారకమైన దేవకు మారుడు యేసుడూ రార్చు చుండు టకు భూరిసహాయ కారియై చేయూతకు గోరి యిచ్చుచు క్షేమ తీరం బునకు జేర్చ దారి జూపుచు మీవి చారముల్ దొలగించు ||రారె||

  2. ఘోరమైన పాప భారంబు మోయుచు దారి గానక తారు మారు లైన నరుల గూరిమితో బిల్చును నారక బాధ లూరక దొల గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కము జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాడు ||రారె||

  3. కారుణ్యుడును నిర్వి కారుడు దురితోప కారుండు శుద్ధాలం కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు బారుబారుగా నున్న పోరి దాటి ప్రభుని జేరి సుఖింతము ||రారె||

  4. ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది సారెసారెకు ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా రాధనము జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై యున్న వారలం దన రక్త ధారోదకముచే జే కూరునట్లుగ జేయు

Post a Comment

Previous Post Next Post