302
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసగెడి దాత సుమీ దోసముల గమి ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి దూతలచేన్ ||యేసు||
- పాప నరుల గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు వుడు ఆ పరమ జనకు నాజ్ఞ బడసి నెరి యాఢ్యుడిడుమ లొందె నుయిలన్ ||యేసు||
- సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్ చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలగుటకు శ్రీకరుడౌ ||యేసు||
- పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత భాస్కరుడౌ నా ||యేసు||
- దుషులు నను గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా ఇష్టుడు వడసిన యిడుమలు దలచి యించుక పగ మది నెంచను నా ||యేసు||