304
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దారి దొలగియున్న వారినెల్లను బ్రోవ గోరివచ్చితి నంచు కూర్మి యేసువు తెల్పె ||వినరే||
- మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేత దన ప్రాణమర్పించి ||వినరే||
- మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు మైత్రిని దలచుచు ||వినరే||
- తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసగును మనసున నెమ్మది ||వినరే||
- తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును తగిన సహాయ్యంబు ||వినరే||