306
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా ||పాపిని||
- జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా నెపముల జెప్పెడు అపవాదిని విడి కృపవాదినిగని బ్రతుకో మనసా ||పాపిని||
- మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా ||పాపిని||
- మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా మరణ బంధముల బరిమార్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా ||పాపిని||
- మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు ఓ మనసా తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా ||పాపిని||