316
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుగ కధిక భార మొంది తుదిని నీ దరి జేరితి నన్నాదరించుము ||దిక్కులేని||
- బలము లేని వాడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలగ జేసి యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య ||దిక్కులేని||
- పామరుండ నౌట వల్లను నే నెఱుగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు ||దిక్కులేని||
- వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు మో ప్రభో సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద పదవు లనుభవింప డెందము వెలిగింప వయ్య ||దిక్కులేని||