a318

318

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పాపినయ్యా నే బాపి నయ్యా కాపాడ వయ్యా పాపభారము నుండి పాపు మయ్యా నన్ను పాపభారమునుండి పాపు మయ్యా ||పాపి||

  1. కాపుమయ్యా నను గావు మయ్య నా పావ నయ్యా జీవమైన యేసు నీ వే నయ్యా నా జీవమైన యేసు నీవే నయ్యా ||పాపి||

  2. ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను గావు మో నా పాలి దైవమా నన్ను గావు ||పాపి||

  3. ఏల వయ్యా న న్నేల వయ్యా మేలియ్య వయ్యా చాల నమ్మితి గరుణా శాలి వయ్యా నే జాల నమ్మతి గరుణా శాలి వయ్యా ||పాపి||

  4. మంటివాడ నే మంటివాడ న న్నొంటి వీడ కె న్నంటి కైన ని న్నంటువాడ నే నె న్నంటికైన ని న్నంటువాడ ||పాపి||

  5. శాంతివాడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత నునుచు ||పాపి||

Post a Comment

Previous Post Next Post