320
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే హేమ రీతిని దేవ కృపలో క్షేమ మున్నది కానరే ||యేసు||
- సత్యవేద సార మెల్ల నిత్యము రుచిచూడరే సత్త లేని దురిత జాలి బొత్తిగా విడ దీయరే ||యేసు||
- కర్త కర్తయనుచు వేడి వ్యర్ధులై చెడి పోకరే స్వార్ధ చర్య లెల్ల మాని కర్త యేసుని బోలరే ||యేసు||
- బంధు మిత్రు శత్రు నెనరు నిందు జూప బూనరే యందమైన మోక్ష విభవము లందు గని హర్పింపరే ||యేసు||
- మోక్ష వైభవ మెదలో దలచి మోసమున బడిపోదురే కక్షి సాతాన్ ముచ్చు వలలను హెచ్చుగా దెగగొట్టరే ||యేసు||
- సద్దులేకను దేవ సేవ ముద్దుతో గొని యాడరే హద్దు మీరు విమత సాతాన్ సుద్దులను ద్యజియింపరే ||యేసు||
- బాధ చేసెడి గురుల వీడుచు బొధకుల దరి జేరరే నాధు క్రీస్తును నమ్మి మీరలు సాధులై వర్తింపరే ||యేసు||