a323

323

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు ||రావయ్య||

  1. హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||

  2. నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు లన్నియు ఖండించుటకు ||రావయ్య||

  3. మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య||

  4. పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియు పార దోలుటకు ||రావయ్య||

  5. అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య||

Post a Comment

Previous Post Next Post