326
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాప భార మనెడు మోపు మోయగ లేక కాపు నీవె యని నీ దాపు జేరిన నేను ||నమ్మితి||
- ఆపత్కాలమునందు బ్రాపు నీవని వేడ గాపాడి రక్షించు కరుణాసముద్రుడ ||నమ్మితి||
- ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత దేవ కుమార ||నమ్మితి||
- దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక నన్ను ||నమ్మితి||