a327

327

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవ నీవు నన్ను బరిశో ధించి బాగుగ దెలిసికొంటివి నీ వెఱుగు దువు నేను కూర్చుండుటయును నే లేచుటయును ||దేవ||

  1. నాకు దలపులు పుట్టినపుడే నా మనస్సు గ్రహించి నాడవు ప్రాకటంబుగ నా నడక నా పడకను బరిశీలించితి ||దేవ||

  2. నీకు నా సమస్త చర్యల నిజము తెలియును, మాట నాల్కకు రాకపూర్వము దేవ సర్వము బూర్తిగా నీకే తెలియును ||దేవ||

  3. నా వెనుకను ముందు నుండి నన్ను నావరిచి నీ చెయ్యి నీవు నాపయి నుంచితివి నా మది కది కేవల మందదు ||దేవ||

  4. అరుగుదెంచెద నెచ్చటికి నీ యాత్మ యొద్ద నుండి యింక నీ పరమ సన్నిధి నుండి నే నెచ్చోటికి బారిపోవుదు ||దేవ||

  5. ఏను వేకువ టెక్కలను ధరి యించి కడలిలో నున్న నీ చెయి మానక నడిపించు నీ కుడి చేయియు మరి నను గైకొను ||దేవ||

  6. నను సృజించిన తెఱగెఱుంగగ నాకు భయ మాశ్చర్య మొదవును గనుక నీకును నే గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ||దేవ||

  7. నేను పిండం బైనయప్పుడు నీవు నను వీ క్షించినాడవు నేను బ్రతుకుట ముందె లిఖితంబాయెను నీ గ్రంథంబులో ||దేవ||

  8. నిక్కముగ దేవా నీ తలపు లెక్కువ ప్రియ మగును నాకును లెక్కకు నెక్కువౌ ||దేవ||

Post a Comment

Previous Post Next Post