a331

331

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మనసా వినవేమే క్రీస్తుని గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు క్షీణం బగుచున్నది గదవే ||మనసా||

  1. చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక యెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా||

  2. లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన ప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా||

  3. మాయ సంతలోన జిక్కి మాయల బోయెదవు కాయము స్థిరమని నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా||

  4. రక్షకయని వేడు నీవు రక్షణకై వేడు రక్షణ బొందుట కిదియే సమయము తక్షణమున వేడు ||మనసా||

  5. అందరమును గూడి యేసుని మందిరమున జేరి పొందుగ క్రీస్తుని పొగడుచు బాడుచు నందున జేరుదము ||మనసా||

Post a Comment

Previous Post Next Post