366
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు చెల్ల చెదర జేసెగా ||యేల||
- నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెగా నీ కలుషము గడిగి వైచి నిన్ను విమలు జేసెగా ||యేల||
- నీకు గల్గు వ్యాధు లన్నా నెవరు మీర దీర్చెగా ప్రాకటముగ నీకు సకల పదవు లిచ్చి ప్రోచెగా ||యేల||
- యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను శ్రమలయందు యేసు పజ్జజేరుమా ||యేల||
- నిన్ను తల్లడిల్లజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిది దరిమి పన్నుగాను బ్రోచెగా ||యేల||
- సందియంబు లేల నీకు స్వర్గ నాధు డుండగా అందమైన యీవులిచ్చి యతడు నిన్ను బ్రోవగా ||యేల||