376
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- గడియ గడియకు నెగసె నమ్ము లెంతో వడిగా నాపై వచ్చె నరక బాణములు ఎగతెగని శోధనములు నీవు పడగొట్టి వేగమె దృఢభక్తి నిమ్మా ||దేవా||
- కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చె మరి నికృష్టములు సాతాను సాధనములు నేను దాటి నీ రెక్కల చాటున నుండ ||దేవా||
- దారా పుత్రుల పైన భ్రమలు నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు ఘోరమగు నాత్మకములు న న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ||దేవా||
- మా యావువుదినములు చెట్టు చాయవలె దరుగుచు మంటి పాలౌను చాలు నీ లోకంబు మేలు మేము పరలోకరాజ్యము చేరుట మేలు ||దేవా||
- మంచి మరణం బిమ్ము దేవ మమ్ము వచించు సాతాను వల నుండి కావ నెంచి దూతల నంపినావ మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా ||దేవా||