a460

460

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    చాటుడి శుభవార్తను బోధకులారా చాటుడి శుభవార్తను జాటు డి శుభవార్త సకల రాష్ట్రములలో జాటించుఃడని చెప్పె ఢాటిగ ప్రభు యేసు ||జాటుడి||

  1. లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతుని బంపె దేవుడటంచు ||జాటుడి||

  2. శత్రువుల రక్షింప మిత్రుడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల లేచెన టంచు ||జాటుడి||

  3. ఎట్టి పాపు లైన బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మిన బట్టుగ క్షమియించు ||జాటుడి||

  4. హృదయ శుద్ధిని గోరి సదయుడగు రక్షకుని పదిలముగ ప్రార్ధింప పరిశుద్ధాత్మ నొసంగు ||జాటుడి||

  5. నమ్మి బాప్తిస్మంబు నెమ్మి బొందిన మనుజు లిమ్ముగ బొందుదు రిలను ఘన రక్షణము ||జాటుడి||

  6. ఇందు నందు మికు బొందుగ నొసగును సందియము లేకుండ సకల భాగ్యము లనుచు ||జాటుడి||

Post a Comment

Previous Post Next Post