463
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దురితదుర్గతి నశియించు వారినిజూచి పరితాప మొందవలయున్ మారమనసు నొంది చేరి ప్రభునితో కలిసి ఘోరపాపిని నేనని వేడి సిలువ ధ్యానించి దురితములను చేయనని తీర్మానములను చేసికొని రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి||
- ప్రథమ దశభాగంబుల ప్రభునకు నిచ్చి ప్రతిదినము ప్రార్థింప వలెన్ అధములగు బీదలకు నాధారముల నొసగి విధిగ భక్తుల నాదరించి సవరించి ప్రభువు వాక్యము చదువుకొనుచు ప్రభుని పాటలు పాడుకొనుచు ప్రభుని వేదము ప్రచురపరచి పదిలముగ జీవించకోరి||
- దేశదేశముల తిరిగి దేవుని వాక్యము దేశప్రజలకు చాటవలెన్ ఆశాదురాశలను కోసివేసి యేసు దాసులను జేసి వెలిగించి తిలకించి యేసుభక్తుల పదిలపరచి యేసుతో పరిచయము చేసి యేసును ధరియింప జేసి యేసుతో నివసించుదారి ||