472
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- వారు నడుచు మార్గమందున సుక్షేమ రాజి వారి ననుసరించు నెందును తేరి చూడ రాని దే దీప్యమాన దివ్యసత్య భూరి తేజ మాజనముల బొలుపు మీర జుట్టుకొనును ||వారు||
- విమోచకుని నామమందున దజ్జనంబుల విశ్రుతానందంబు ప్రాణముల అమందముగ హెచ్చరించు నతని నీతి రీతి దజ్జ నముల కోర్కె వృద్ధి బొం దంగ జేయు సంతతంబు ||వారు||
- నరులపై బిశాచమును నిందా స్థాప నంబు జేయంగలేదు పరగు ప్రకాశమును బ్రాపు నైన సర్వే శ్వరుడు బలము రక్షయు న వారితముగ మనకు నిచ్చు ||వారు||
- వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా వన్నె మీర మీ రాజు సురుచిరముగ శాశ్వతముగ పరిపాలించు మీ దేవుడు నిరతముగను జీవించు నీతి భరిత చిత్తుడగుచు ||వారు||