a480

480

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    లోకము వారెల్ల లోకువ జూచిన లోపము నీకేమిటి ప్రాకట ముగ గ్రీస్తు పతిత పావన మూర్తి నీకోసమై ముక్తి నిలయము గట్టంగ ||లోకము||

  1. దరిలేని దురిత దుస్తర పారావారము దాటించు వారెవ్వరు భీకరమైన నరకాగ్ని బెట్టు బిం ధుర దేవకోపాగ్ని మరలించు వారెవ్వరు చంచల బుద్ధి స్ధిరపరచి పరమార్ధ మెఱిగించి చిరముక్తి గురి దెల్పు వారెవ్వరు ఈ ధరలోన నరరూపు దాల్చి నీ కొఱకై జీవన మిచ్చు కరుణాబ్ధి క్రీస్తుడు వరదుడై యుండంగ ||లోకము||

  2. మాటి మాటికి బాప మార్గమున జనుచుండ మది ద్రిప్పు వారెవ్వరు సైతానుని తాటించి మరి వాని కేటించి యభయ హ స్తము నిచ్చు వారెవ్వరు మృత్యువు ముల్లు మీటించి సుఖమాత్మ నాటించి తన యోర్మి చాటించు వారెవ్వరు యెరుషలేము బైట కల్వరిమెట్టు పై మేను బలియిడిన మేటి క్రీస్తుని నామా మృతము నీకుండంగ ||లోకము||

  3. హృదయ సంతాపదుః ఖ దురంతమగు చింత ల్వదిలించు వారెవ్వరు నెమ్మది నిచ్చి పదిలమ్ముతో మోక్ష పద మిదుగో యంచు పదమను వారెవ్వరు ఎన్నడు నిన్ను వదలి వెయ్య మంచు మృదువాక్యములు తెల్పి ముద మిచ్చు వారెవ్వరు నింకొక నాడు సదయుడై క్రీస్తుడు చనుదెంచి నిను ముక్తి సదనస్థునిగ జేయు శాస్త్రోక్త మిటులుండ ||లోకము||

Post a Comment

Previous Post Next Post