a487

487

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరదేశి, పుణ్యక్షేత్ర యాత్ర బోవుచుందువా? యేసు నాజ్ఞ తల పోసి మోక్ష మొంద బోదును. కొండ లెక్కి యేళ్లు దాటి మోక్ష రాజ్యం చేరుదాక ముందు పోవుచుందును.ఒంటిగాను బోవుదువే నీకు భయ ముండదా? లేదు నాకు భయమేల? స్వామి నన్ను గాచును; మోక్ష రాజ్యం చేరుదాక యేసు నాకు దోవచూప ముందు పోవుచుందును.పరదేశి, మోక్షమందు నీకు లాభ ముండునా? నిత్యానంద సువిశ్రాంతి యందు నుండు లాభము. జీవనది నీళ్లు త్రాగి యేసుతో సదా వసింప ముందు పోవుచుందునుపరదేశి, నీతో నేను యాత్ర చేయ వచ్చునా? రమ్ము నాతో గూడ రమ్ము యేసు నిన్ను రమ్మనెన్ మార్గాయాసమైన నేమి మాకు మోక్షం చిక్కు వేళ సువిశ్రాంతి కల్గును.

Post a Comment

Previous Post Next Post