నీతిగల యెహోవా స్తుతి

5

రాగం - నవరోజు
తాళం - త్రిపుట
    నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో నర్పించుడి } 2
    దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుఁడి ||నీతి||

  1. చదలఁ బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కఁగా } 2
    సదమలంబగు దైవనామము సర్వదా నుతిఁజేయను ||నీతి||

  2. సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్రము లన్నియు } 2
    గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిఁజేయను ||నీతి||

  3. గీత తాండవ వాద్యములచేఁ బ్రీతి పరచెడు సేవతో } 2
    పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుఁడి ||నీతి||

  4. పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని } 2
    పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు ||నీతి||

  5. ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని } 2
    వెలయు స్తుతి వే నోళ్లతోడను విసుగు జెందక జేయుడి ||నీతి||

  6. ఆత్మ నీవిఁక మేలుకొని శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని } 2
    త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే ||నీతి||

    ✍ పసుపులేటి దావీదు


    Niithigala yohoavaa sthuthi mii – yaathmathoa narpinchudi-mii yaathmathoa narpinchudi } 2
    dhaatha yow mana kriisthu niithini dhaalchu koni saevinchudi || Niithigala ||

  1. Chadhala pudamiyu raviyu jaladhiyu- nadhulu girulunu chakkagaa } 2
    sadhamalambagu dhaiva naamamu-sarvadaa nuthi jaeyanu || Niithigala ||

  2. Sarva sakthuni kaaryamulakii –sarva raashtramu lanniyu } 2
    garvamulu vidi thalalu vanchuchu - nurviloa nuthijaeyanu || Niithigala ||

  3. Giithaa thaandava vaadhyamulachae –priithi parachedu saevathoa } 2
    paathakambulu pariharinchedu – dhaathanae saevinchudi || Niithigala ||

  4. Parama dhuuthalu naruni pudamini –moralu pettuchu dhaevuni } 2
    paramu nandhunnatti yaesuni –paadamulu saevinthuru. || Niithigala ||

  5. Eilanu bhakthulu kuudukoni yaa- balamu kalgina dhaevuni } 2
    velayu sthuthi vaenoallathoadanu – visugu cendhaka caeyudi || Niithigala ||

  6. Athma niivika maelukoni su-ddhaathma yaesuni tandrini } 2
    thrithva magu naa yaeka dhaevuni –harshamuna saevimpavae || Niithigala ||


    ✍ Pasupuleti Dhaveedhu

Post a Comment

Previous Post Next Post