a559

559

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వస మాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకు మంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభ మంగళము ||జయ||

  1. కానాకు జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుడ తెల్పితివి మానితముగా ||జయ||

  2. నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకు దగు నెచ్చరికగా గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక ||జయ||

  3. ప్రేమానుబంధమున బెనగి యీ దంపతులు వేమారు నీ మహిమ వెదకి భువిని కామాదులను గెల్చి కైవల్య పురమునకు క్షేమ మగు కృపనిచ్చి చేరనిమ్ము ||జయ||

  4. ఆదికాలము నాబ్ర హాము శారా లెంతో నీ దయలో బ్రతికి యిల నెగడినట్టు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయారసమొస గు మక్షయుండా ||జయ||

  5. సంతానము గాంచి సద్భక్తిలో బుద్ధి మంతులై క్రైస్తవ మతము నందు అంత్యపర్యంతంబు నణుకువగ బెంచ నా ద్యంత రహితుండ స హాయ మిమ్ము ||జయ||

  6. కర్తయైన క్రీస్తు కరుణయు దేవుని పరమపూర్ణ ప్రేమ ప్రబలము గను సురుచిరం బగు పరి శుద్ధాత్ము నైక్యత కలుగుగాక దంప తుల కనిశము ||జయ||

Post a Comment

Previous Post Next Post