566
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పవిత్ర కల్యాణంబున్ పదిలపర్చుచు దైవ త్రిత్వంబు నేడున్ దీవింప వత్తురు.
సంతాన వరమును సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు.
ఆదామునకు దండ్రీ, హవ్వ నొ సంగితి వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము
నీ ఱెక్క క్రింద వీరి బరిగ్రహించుచు వైరి తంత్రంబునుండి దూరంబు జేయుము.
ఈ రీతిన్ బ్రత్కి యంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి బరంగ జేయుమి.