a586

586

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యెహోవా నీ మహిమ స్తవము యేసుని సుందర మందిరము ఇది యెంతో నిత్య శుభకరము సాహసమున క్రై స్తవాళి తోడను స్నేహ మమర నీ శిష్యులు నిపు డీ గేహమునకు భ క్తిని జేరిరి నీ బాహు బలము గ న్పపడ దీవించుము ||యెహోవా||

  1. ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ నికేతనంబులు ||యెహోవా||

  2. పరమండలంములం దుండి నీ కరుణ జల్లి యీ యాలయము పైని సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల నిమ్మని నెరి బ్రార్థింతుము ||యెహోవా||

  3. అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ మందిరములు గా ముందొనరించుచు బొందుగ నలు దెస లందు నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతి బొందుట కిందురాను నీ వింక నొనర్పుము ||యెహోవా||

  4. పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతో దన క్షత రక్త మహౌ షధ మిడి ప్రోవను ||యెహోవా||

  5. ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలో జేరియుండు దాని కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది సౌఖ్యమొందుదము ||యెహోవా||

Post a Comment

Previous Post Next Post