589
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడు మమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధ నమ్ములమ్మ||
- అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదు వమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైట నున్నారమ్మ||
- ఘనుడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగ ప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలతుల ప్రేమింపవలె వినుమ దూషింపక దీ వించు మమ్మ||
- పనులెన్నో నీ కున్న ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన దెల్పుమమ్మ ఒనరంగా నేడాది కొక యాత్మనైన నిక నెనరుతో రక్షింప నేర్చుకొమ్మ||
- ఎల్లసేవకుల కొర కెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లు నమ్మ పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సా ధనములమ్మ ||