a591

591

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    త్ర్యేక దేవుడ యెహోవ దేవు నే నమ్మి సేయుదు సేవ దేవ పరలోక భూలోక ముల నెల్ల బుట్టించి పాలించు తండ్రి దే వుని నమ్మెదను నేను ||త్ర్యేక||

  1. శ్రీ దేవసుతు డేసు క్రీస్తే యేక చిరజీవ నాధుండు నాకే దేవ కన్య మరియమ్మ గ ర్భమున జన్మించిన కరుణగల దేవుని గూర్మితో నమ్మెద ||ద్ర్యేక||

  2. పొంతి పిలాతు కాలమున యేసు పొంది శ్రమలను సిలువమీద దేవ కొట్టబడి చనిపోయి పెట్టబడి భూమిలో మూడవ దినమందు మృతి గెలిచి లేచెను ||త్ర్యేక||

  3. పరలోకమున కెక్కె యేసు క్రీస్తు పరమతండ్రికి గుడివైపు దేవ సింహాసనముమీద స్థిరముగా గూర్చుండి యున్నాడు చిరన్యాయ కర్తయై యున్నాడు ||త్ర్యేక||

  4. అక్కడనుండి ప్రభు యేసు వచ్చు నిక్కముగ దీర్పు దీర్చుటకు దేవ మరణ మొందినవారికి బ్రతికి యున్నవారికి న్యాయంబు దీర్చును న్యాయవంతుడు యేసు ||త్ర్యేక||

  5. శుద్ధాత్మ దేవుని నేను మన శుద్ధితో నమ్మి కొల్చెదను దేవ శుద్ధ సంఘంబు పరి శుద్ధుల సహవాస మును నమ్మెదను నిత్య మును నేను నిజ మిది ||త్ర్యేక||

  6. పాపక్షమాపణను నేను ఎంతో బలముగా నమ్మెద నిలను దేవ ఈ శరీరముపోయి యంత్యదినమున మరల లేచునని తిరముగా వాసిగా నమ్మెద ||త్ర్యేక||

  7. నిత్యజీవము నమ్మెదను నేను నిజముగా శ్రీ యేసు పేర దేవ నిత్యుండు తండ్రి దే వుడు కుమారుండును ఆత్ముండు సత్యుండు త్ర్యేకుడౌ దేవుండు ||త్ర్యేక||

Post a Comment

Previous Post Next Post